కుంభునభిషేకముల నెంతగా జేసితివొ- భూమి భారము నీవెంతగా నెంచితివొ,
భావమందిన పరమ గురువులు – వేగ పడగా నేల నెంచిరో,
తోక చుక్కను వాహనము గొని – తరలి వేగమే జేరినారు!
శక్తిపాతపు వేగమందిన వాణి వైనము తెలియగా,
పురములన్నీ చేరి చూచెను నీదు తనువట పొంగగా!
నాటి శంకరుడందుకొన్నా గంగ గతులను బోలుచూ,
భువికి తరలిన అమర వాహిని వైనమని వారెంచిరో!
అమర వాహిని నదుపు జేసి, మందిలో అది పంచు తలపున,
ఎన్నుకొంటివి ఉభయ సంధ్యల ఆరు గంటలు వేళగా,
సులభమౌ మూడక్షరంబులు పలికినంతనె తీరుగా,
పంచి ఇత్తువు పరమవాహిని పదిల మొందగ బొందిలో!
లాఘవంబుగ నీదు కరుణను-పొందిరెందరో ముందుగా,
ఈతి బాధల ఈదులాటన- నీదు తోడును మెండుగా!
అక్షరంబులు పలికినంతనె- అంది వచ్చెడి వైభవం,
ఎరుక జేసిరి ఎల్ల జనులకు- కొల్లగొట్టరె కుంభరాశని!
నియమపాలన నెరుగలేనొక-నీరసించిన నీచజీవిని,
కరుణతో నీ నియమ రేఖను – ఎల్ల లెంచక పెంచరాదా,
పిలచి నంతనే పలికి నంతనే – నీదు నీయమము చెల్లునా?
ఎటులనో ఒక దారిజూచిక – నన్ను నీ దరి జేర్చరాదా?