మొర

qkneeling_in_prayer1q

తొల్లి మ్రొక్కిన  మొక్కు తీర్చలేదని – నేడు

సంకటము సంధించి సాధింతువాడవని,

ఎరుగ నేర్వని నేను – మిన్నకేలుంటినో!

కన్నతండ్రివి నీవు – కినుక తగదిక నీకు,

కూరిమిన దరిజేరు – దారి లేదు!

ఏనాడు ఏమ్రొక్కు ఏ వేల్పు కొడ్డితినొ,

మరగు పరచిన మరుపు నాదు గాదు!

మరుపన్న మందిచ్చి మనుగడను నడిపేవు!

మాయలోకపు మగడ మన్న నొందు!

అడుగు అడుగుగ నడచి అద్దరరుగుదమంటె,

అడుగు అడుగుకు నడుమ ‘నింగి’ నిండె,

దాని వైనము దెలియ అమరులకు సెక్యమే!

తేట తెలియగ నాకు తెలియ తరమే!

వాదాడి గెలువగా వాక్దేవి వరమేది?

వారిజాక్షికి నీవు వరదుడాయే!

సేవించి మెప్పించి సన్నుతింతమనన్న,

మంది మధ్యన నీవు అందవాయే!

ఏలాగొ ఓలాగ ఏలుకొనుమో నన్ను,

ఎంత హీనుడనైన నీవు నెరపినవాడ,

దరిరాకు మని నన్ను దూరంబు నిడబోకు!

ఇడుము లంపెడి నీకు దీర్చు వైనము లేదా?

ఇందు వదనను ఇందు వైన మడుగు!

కనతల్లి గాదె నా కరుణ వల్ల,

కొసరి కొంచంబైన కూరిమొసగు,

కోటికొన నాడైన కోవెలెరుగని నేను,

కొలువు జేయగ నీదు కొలువీయ రాదె!

కనక ధారల వాన కురిపించ గల తల్లి,

కాలునికి పరమాన్నమొసగు తల్లి,

క్రీగంటి చూపుతో వెతల దీర్చెడి తల్లి,

కావు మని ఒప్పించు ఏలు వాని!

ffall1f

 

Leave a comment