జయ జయ శంకరి

జయ జయ శంకరి

జయ జయ శంకరి – విశ్వకుటుంబిని

విజయము చేయవె – విభవములమరా!

వేడెద నీదయ వేడెద సన్నిధి,

వెరపును మాపవె కాంచన రాశీ!

మదనుని పాశము నాశము జేయకే,

కరముల గొంటివి – నళినదళాక్షీ,

నాశము జేయవే మోహము నాలో,

కాముని కరములు సోకిన తనువున…

జయ జయ శంకరి – విశ్వకుటుంబిని

విజయము చేయవె – విభవములమరా!

మత్సర మణచెడి మాతవు నీవని,

మదినమ్మితి నే మాధవు మహిషీ,

మరులను గొలుపక మచ్చిక నెరపుము,

మాయను బడితిని మనుపుము తల్లీ..

జయ జయ శంకరి – విశ్వకుటుంబిని

విజయము చేయవె – విభవములమరా!

వేదాంగంబులు అమరిన రాణివి,

చల్లని చూపుల నేలెడు వాణివి,

చెలువము చిలుకవె చింతల పాదున,

మూలము మడియగ నా బీరమునా..

జయ జయ శంకరి – విశ్వకుటుంబిని

విజయము చేయవె – విభవములమరా!

వేడెద నీదయ వేడెద సన్నిధి,

వెరపును మాపవె కాంచన రాశీ!

Leave a comment