రచన

పురమ నేలెడి తల్లి పూర్ణకామిని నీవు,

క్రీగంటి చూపులతొ కూరిమిచ్చెడి నీవు

పెత్తనముగా లోన కదలాడు చుండగా,

ఇహలోకమున ఇడుము లేల కలిగేను?                                                                                                                                   మొలనూలు మువ్వలకు విశ్రాంతి లేకుండ,

మృదుకంపనల ఝరులు జాలువారుచు నుండ,

రూపుగట్టెడి కల్పనొకటైన రచియింప,

అలవి గాకెటు మేము అలమటించేము?

చిత్తు సత్తుల సత్తువెరిగిన తల్లి,

చిత్త మెరుగగ లేని చిన్ని పాపడిని,

బ్రతుకు తెరువును కుడిపి కనికరించమ్మా!

కామాక్షివట నీవు కామితములొసగా!

Leave a comment