సంతస రూపుడు

నీతోడుగా ఆనంద మందీయగా రారా- అలివేణి గిరికన్య అనురాగ ఫలమా!
మందాకినీ మునక అనుదినము నందేటి – పరమేశు సిగపువ్వు నీకు అలుసు,
వేదనాధుడె గాని వేదాంగమే గాని – తొలుతనిన్నే తలచి సంతసించు!
|| నీతోడుగా ఆనంద మందీయగా రారా||

తొలినాటినుండెన్నో తొలిపూజలందినా తల్లిగారవమొంద తలచినావో,
ముక్కంటితో క్రీడ ముప్పుగాదని ఎంచి బాలుడై ఎదురొడ్డి నిలచినావో,
వ్యాసవాణిని వ్రాయ మరియెవరు లేరంచు గుజ్జుబాలుని రూపమందినావో,
మా పున్నెములు పండి సున్నిపిండిన దూరి మోదకంబుల విందు నందినావొ!
|| నీతోడుగా ఆనంద మందీయగా రారా||

Leave a comment