నాపూజ గైకొనర

ఆనంద వారాధివి రాజ్యమేలుచు నుండ

ఆదుకొమ్మని పలువు రేలాగు అరచేరు?

అవని ప్రతి అణువందు ఆనందమే నింపు

నీ తలపు లేల ఈ చరసాల గనకుండె?

క్షీరసాగరమందు జనియించినా ‘మృతము’

హరుని జేరకముందె నెలకొల్పెనీ నెలవు

నానాటికీ పెరిగి నీ ఎల్ల లన్ద్రుంచి

ఆర్తనాదపు సీమ ప్రతి అణువనంటోంది!

జగన్నాధుడవీవు- జగదేక వీరుడవు

బహురూములు గోన్న నీ ప్రతులు పతనమై

గ్లాని గొన్నాప్రతులు పరితప్తులైనాయి

తమను తామెరగుతరి ఎరుగలేకున్నాయి!

ఏదివ్య జోలలకు మైమరచి యున్నావు?

ఏ మత్తు అత్తరుల అలదుకున్నావు?

ఏదివ్య ఘడియకై ఆగియున్నావు?

నీ సుతులనీ ‘కలి’న ఏల మరచేవు?

నీలకంఠుని ‘నీలి’ లోకాన నిండింది

నీరసంబై జగతి నిర్వీర్యమైయ్యింది

నిత్యానురక్తుడవు – రక్తివీడిన వేళ

శతృవై నీవె నీ జగమెల్లదృంచేవు!

జయవిజయు లన్ద్రుంచి ధరణి గాచిన వాడ

అసుర సంతతినేల అదలించ కున్నావు?

ఏలాగొ దయగనర – నాపూజ గైకొనర-

నా సుతుల హృద్సీమ నొడుపుగా గైకొనరా!

Leave a comment