చక్షు రధ చాలనకు సారధివి నీవు,
గురుతు గలిగించగల గురుతైన నీవు,
ఎరుక గొను గురుతులో ఎరుకైన నీవు,
తలుప వేలనొమాప ఇట్టి ఎడబాటు?
చిగురు భావములందు భవమైన నీవు,
భవ బంధముల బంధ మాధుర్యమీవు,
మరుగు నెరుగని బంధ భావనవు నీవు,
మరలింపవే నన్నునిన్నెరుగు నటుల!
కాంచీ పురపు కరుణ – కైలాస గిరి నెలత!
కోల్హాపురిన కొలువు తీరున్న మమత!
కవుల కావ్యములందు కదలాడు మృదుల!
కాపుగాయగ మెదలు భాగ్యమేమందు?
తనువు చేతనవైన గిరిరాజ కన్యా!
నిన్నెరుగ ఏదారి నేనొంద గలను?
దరిజేరు దారియగు దుర్గమాయమ్మా!
దయనొంది దారొసగు దరిజేయులాగ!