తరుగైన మెరుగైన తనయులమె తల్లీ! కరుణించి మమ్మేలు అనురాగ వల్లీ!
ఒకడు చింతల మూట ! ఒకడు ఊహల ఊట ! ఒకడుఆశల కోట! ఒకడు వేట!
పాటు పాటున నిన్ను తలపోసి తలపోసి విసిగి వేదన మునుగు ఒకడి బాట!
వాడైన వీడైన వీడకే వెన్నంటి నడుపు సమయపు చాలు నీదుబాట !
ఒక వంక నెలవంక – ఒకట వెలుగుల పుంత – ఒక చోట మినికు మను వెలుగు జిలుగు,
ఒక గిరిన తుహినములు – ఒక గిరిన వెలి మంట – ఒకట చోట పొంగారు గంగ ఊట!
పరిగ పైరులు కొన్ని – పరువంపు పరి కొన్ని – పంతమాడెటి ఝరుల వసతి కొన్ని!
ఆవంక ఈ వంక ఏ వంక ననకుండ వంక వంకన వంక నీవెగాదా!
బహు భావనల పుంత – బోగ భాగ్యపు ముంత –అణగారు లేమిలో వణుకు గుటిక,
పలుకు లల్లెడి మాల – పలు దూషణల దండ – పలుకు లొల్లని మూగ పలుకు దొంతి,
వలదన్న – వరమన్న – పలుమారు వినుమన్న – ఒల్లనొల్లక తొలగు తెలివి తెలివి ,
ఉంది ఉందను దాన ఉన్నదంతయు నీవె – ఉరుము చూపుల నాపి మనుపు తల్లీ!