మహతి పలికెడి దివ్య నామంబు వినరే!
కుడిచి వీనుల ఉనికి మోదంబు గనరే!
ఆద్యంతములు లేని ఆనంద నాదంబు,
అలుపెరుంగక మహతి పలికేటి నామంబు,
అసురాంతకుని జాడ నెరిగించు నామంబు,
అందరే తరియింప తలపు గల వారంత!
వరమౌని వరియించి జపియించు నామంబు,
వనిత శ్రీసతి మెచ్చి వరియించు నామంబు,
వనవాసులనుదినము జపింయించు నామంబు,
వరదుడై మనివరుల గాచేటి నామంబు!
నింగి నేలను మ్రింగు మహిమ గల నామంబు,
నియతి నియమము దెలుపు దొడ్డ నామంబు,
నిటలాక్షు మదినేలు బహు పుణ్య నామంబు,
నిహిత హితకర గంధ ఋచియైన నామంబు!