రమా రమణు కథ రమ్యము కాదా!
భావింపగ రాదా!
మంధర గిరిధరు మదినెంచుటయే,
ఆనందము గాదా!
శ్రీ రమా రమణు కథ రమ్యము గాదా,
భావింపగ రాదా!
ఇనకుల తిలకుని, ఇందిర నాధుని,
లీలలు గన రాదా!
శ్రీ రమా రమణు కథ రమ్యము గాదా,
భావింపగ రాదా!
హిమగిరి నేలెడి గౌరీనాధుని – మానస చోరుని ,
మంగళ చరితుని – చింతింపగ రాదా!
శ్రీ రమా రమణు కథ రమ్యము గాదా,
భావింపగ రాదా!