పొద్దుగడిచెను పొన్నపూవులు – వాడి వసుధను జేరేనే,
వెన్నెలాటలు మాని రయమున – పంచజేరర మాధవా!
లేగ పిలిచెను గోవు పిలిచెను – గొల్లభామలు వెదకిరే!
నందునంగన ఆంగనంబున – నిన్నుగానక వగచెనే!
పొద్దుగడిచెను పొన్నపూవులు – వాడి వసుధను జేరెనే,
వెన్నెలాటలు మాని రయమున – పంచజేరర మాధవా!
చల్లకుండలు ౘలము జేసెను – ౘలము జేసిరి గొల్లలూ,
విరిసి కన్నుల నిన్నుగానక – చిన్నబోయెను పూబాలలూ!
పొద్దుగడిచెను పొన్నపూవులు – వాడి వసుధను జేరెనే,
వెన్నెలాటలు మాని రయమున – పంచజేరర మాధవా!
మరలి రావయ మాధవా – రేపల్లె పూజల నందగా,
నందగోకుల మందు విందుగ – వెన్న విందులు జేయగా!
పొద్దుగడిచెను పొన్నపూవులు – వాడి వసుధను జేరెనే!
వెన్నెలాటలు మాని రయమున – పంచజేరర మాధవా!