కాళి రక్షగు నీకు – కైలాస పతి రక్ష,
కామ జనకుడు రక్ష – కామాక్షి రక్ష,
కార్తికేయుడు రక్ష – మోదక ప్రియు రక్ష,
కాలమంటని కరుణ అడుగడుగు రక్ష||
పద్మనాభుడు రక్ష - పద్మాక్షి రక్ష,
పంకజాసను రక్ష - ధవళాంగి రక్ష,
ప్రమాధిపతి రక్ష - పరదేవి రక్ష,
పరమ పితయగువాని అడుగడుగు రక్ష||
ఫాల నేత్రుడు రక్ష - పరమాత్మ రక్ష,
పాల్కడలి నేలేటి - పరమేశు రక్ష,
పాప నాశిని రక్ష - పవనాత్ము రక్ష,
పాంచాలి రక్షకుని అడుగడుగు రక్ష||
రాకెందు ధరు రక్ష - రమాపతి రక్ష,
జగమేలు జనకుడా శ్రీనాధు రక్ష,
ఆనాటికానాడు ఏదారి నడచినా,
నడచి తోడుగ నిన్ను రక్షించు గాక||