గురు చరణముల గంటెనే

గురు చరణముల గంటెనే – నే నరుదైన తరుణమున,
నా కనుల నిండ – వింతైన కలలోన – నే….

చరణములా అవి అభయపు కనుమల
ఆదరమున దరి జేర్చెడి రధములా?
రాగమునైనా భోగమునైనా భావించిన తా నీడేర్చడి ఆ…

గురు చరణముల గంటినే – నే నరుదైన తరుణమున,
నా కనుల నిండ – వింతైన కలలోన నే….

ఎల్లలు పొల్లెడి చెల్వపు వాకల –
మునిగిన విబుధుల వినయపు ఊర్పులు,
మోదము మీరగ మౌనము నందిన భావన నెరిగి తా నీడేర్చెడి ఆ..

గురు చరణముల గంటినే – నే నరుదైన తరుణమున,
నా కనుల నిండ – వింతైన కలలోన నే….

కననెంచవే నా కన్నులు విడివడి,
       కోమల చరణపు జాడలు చెదరగ ,
       వేకువ కలతకు ఊరట నొసగగ జగముల నిండదే  చిన్మయు పాదము..      

గురు చరణముల గంటినే – నే నరుదైన తరుణమున,
నా కనుల నిండ – వింతైన కలలోన నే…. గురు చరణముల గంటినే

     

చరణముల గంటినే – నే నరుదైన తరుణమున,
నా కనుల నిండ – వింతైన కలలోన నే…. గురు చరణముల గంటినే

Leave a comment