ఆలోచన : ఋషులు ఈ సృష్టి మూలం/కారణం గురించు అన్వేషిస్తే - వేదం వినిపించింది.
వేదం – ఈ సృష్టి ఎలా ఉండాలి/ఉంది, దాని ధర్మం, మొదలుగా గల అన్ని వివరాలతో, భగవదవతార విషయాలు కూడా వివరించింది. దానికి ముందు, సంకల్పమే కాని, శబ్దం లేదు. కనుక, బహుశా, ఋషులు దానిని వినలేదు కనుక పలుకలేదు, అది కేవలం గ్రహించవలసిందే. “అది” నిశ్శబ్దం, నిశ్చలం, నిర్మలం,నిరాకారం ..వంటి అలంకారలతో ఊహించవలసిందే. శ్రీ లలితా సహస్రనామంలోని , “నిస్తులా నీల చికురా… ” మొదలుగా గల నామాలు , ఈ స్తితి గురించి కొంత ఆలోచనకు అవకాశం ఇస్తున్నాయి. ఈ నామాలు హయగ్రీవుడు ఉపదేశించినట్లు – దేవీ పురాణం చెబుతొంది.
అయితే, “బ్రహ్మ సూత్రా”లలో మొదటిదైన ” అధా తో బ్రహ్మ జిజ్ఞాసా” (ఇక/ ఇంక బ్రహ్మం గురించి తెలుసుకుందాం/ తెలుసుకోవాలి) అని వివరణ ఇస్తూ, శ్రీ సామవేదం వారు, బ్రహ్మ నోటి నుండి, వెలువడ్డ మొదటి శబ్దం, “ఓం అధ” అని చెప్పారు. అంటే, అంతకు ముందు ఎంతో ఆలోచన చేసి, లేదా ప్రయత్నాలు చేసి (భాగవతంలో – సృష్టి చెయ్యడానికి పూర్వం బ్రహ్మదేవుడు అనేక వేల సంవత్సరాలు తపస్సు( ఆలోచన/తర్కం) చేసినట్లు చెప్పబడింది. ) చివరికి , ఈ మనం నివసిస్తున్న “లోకం” నిలపడానికి ఉపక్రమిస్తూ, “ఓం అథ” అనే పలుకు, నోటివెంట పలికి ఉండవచ్చు. అది, ఈ మనం నివసిస్తున్న “లోక” నిర్మాణానికి – మొట్టమొదటి శబ్దం – గా గ్రహించ బడ్డది.
అయితే, ఇది తెలిసినందువల్ల ఏమిటి ప్రయోజనం? బహుశా – శబ్దానికి ముందు – “నిశబ్దం” లేదా శబ్దం లేని – ఆలోచన / తర్కం – అనే స్తితి ఒకటి ఉంది, అని తెలియాలేమో. బహుశా – దీనినే – “మౌన వ్యాఖ్యా ప్రకటిత…”
అని దక్షిణామూర్తిగా భగవానుడు తెలియజేయగా, ఋషులు గ్రహించారని, మనం చదువుకుంటున్నామేమో!!
కనుక, శబ్దాతీత మౌనం లో భావాన్ని అందుకోగల స్థితి కలిగిన వారు, ఈ లోకం/సృష్టి గురించి, కొంత తెలుసుకో గలరేమో!!
🙏
LikeLike