గుడిగల మంత్రపు వెలుగుల గురుతిచ్చిన పాదము,
తడబడు జీవుల బ్రతుకుల దయనేలెడి పాదము,
లోకపు శోకము బాపగ తరలిన ఈ పాదము,
తోడుగ మా జత నిలువదె వీడక ఇకనెన్నడూ!!
తారల తళుకుల సారపు రూపమె ఈ పాదము,
తరగని మోహపు పడగల నణచెడి ఈ పాదము,
పండిన మనసుల విడువక నడయాడెడి పాదము,
తోడుగ మా జత నిలువదె వీడక ఇకనెన్నడూ ||గుడిగల||
ధరణీపతి రూపముగొని ధర నడవిన పాదము,
వసుమతి నోముల ఫలముల సారంబీ పాదము,
గురువుల గురువుల గురువుల గురుతగు ఈ పాదము,
తోడుగ మా జత నిలువదె వీడక ఇకనెన్నడూ ||గుడిగల||