రామ కోట-య్యా


రామనామపుకోట – తరలి రావయ్యా!
మురిపాల పూదోట- తరలి రావయ్యా!!

    కాలుడెరుగని దారి నడచినావయ్యా!
    కోరి మా ముగిళ్ళ కొలువుదీరయ్యా!!

రామనామపు కోట – కదలి రావయ్యా!
మరిపాల పూదోట- కదలి రావయ్యా!!

        నాటి సంగపు గురుతు - మరువబోకయ్యా!
         చేరి నిను సేవించ - చేతకాదయ్యా!! 

రామనామపు కోట – తరలి రావయ్యా!
మురిపాల పూదోట- తరలి రావయ్యా!!

              కోరి చక్కెర నిన్ను తరపోతుమయ్యా!
              చెలిమి చక్కెర కుడిపి తోడుండుమయ్యా!!

రామనామపుకోట – తరలి రావయ్యా!
మురిపాల పూదోట- తరలి రావయ్యా!!

Leave a comment