మహాభారతం – శాంతిపర్వం :
కాల గణన గురించి ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భీష్మ పితామహుడు : వేదవ్యాసుడు తన కుమారుడైన శుకునకు వివరించిన క్రమాన్ని ఈ విధంగా తెలిపాడు
పజ్జేనిమిది రెప్ప పాట్లు – ఒక కాష్ట
ముప్పై కాష్టలు – ఒక కళ
మూడు వందల అరవై కళలు – ఒక ముహూర్తం
ముప్పై ముహుర్తాలు – ఒక అహోరాత్రం
ముప్పై అహోరాత్రాలు – ఒక మాసం
రెండు మాసాలు – ఒక ఋతువు
ఆరు ఋతువులు – ఒక సంవత్సరం
మూడు ఋతువులు – ఒక ఆయనం – ఉత్తరాయణం/ అగ్ని/శుక్ల పక్షము &
దక్షిణాయనం /ధూమం /కృష్ణ పక్షము
“విద్వాంసులైన ” మానవులకు ఒక నెల – పితరులకు ఒక రోజు
( ఇక్కడ “విద్వాంసులైన ” అనే పదం వాడటాన్ని గమనించాలి. “రెప్పపాటు” తో మొదలైయ్యే కాల గణనం – సామాన్యులకు , విద్వాంసులకు – వేరుగా ఉంటుందని భావన చేయవలసి ఉంటుందేమో )
మానవులకు ఒక సంవత్సరం – దేవతలకు ఒక రోజు
కృతయుగం – 17,28,000 మానవ సంవత్సరాలు – తపస్సు స్వభావంగా కలిగి ఉంటారు
త్రేతాయుగం – 12,96,000 మానవ సంవత్సరాలు – శ్రేష్టమైన జ్గ్యాన స్ఫూర్తి స్వభావంగా
ద్వాపర యుగం – 8,64,000 మానవ సంవత్సరాలు – యగ్యం స్వభావంగా
కలి యుగం – 4,32,000 మానవ సంవత్సరాలు – దోషాచరణము స్వభావంగా కలిగి ఉంటారు
4 యుగాలు కలిస్తే – ఒక మహాయుగం
1000+1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, రాత్రి
యుగం ఆద్యంత భాగాలను – సంధ్య – సంధ్యాంశము – అంటారు. So,
కృతయుగం – 1,44,000 మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము
త్రేతాయుగం – 1,08,000 మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము
ద్వాపర యుగం – 72,000 మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము
కలి యుగం – 36,000 మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము
My understanding :
ఈ సంధ్య సంధ్యాంశాలు మొత్తంలో సగభాగం – సంధ్య & సగభాగం సంధ్యాంశముగా తీసుకుంటే మొత్తం కలియుగ కాలం 4,32,000లో 18,000 + 18,000 =36,000 సం||యుగసంధి కాలంగా స్వీకరించాలి.
యుగం నాలుగు పాదాలుగా భావిస్తారు. కనుకనే – సంకల్పంలో ” కలియుగే ప్రధమ పాదే” అనటం వింటుంటాము. కలియుగం మొత్తాన్ని 4భాగాలు చేస్తే – మొదటిపాదం 1,08,000 మానవ సంవత్సరాలు అవుతుంది . శ్రీ కృష్ణ జననం 5,110 సంవత్సరాల పూర్వం అన్న కధనం ప్రకారం – మనం ఇంకా యుగసంధిలోనే ఉన్నాం అనుకోవాలి. కృష్ణ జననం కలియుగంలో అయ్యే అవకాశం లేదు కనుక, అవతార సమాప్తి నుంచి లెక్కించాలి. కృష్ణఅవతార ఆయుఃప్రమాణం 125 సంవత్సరాలుగా చెబుతారు. కనుక కలి ప్రవేశం జరిగి 5000 సంవత్సరాలు కంటే ఎక్కువ కాదు.
ఈ యుగ సంధి కాలమే ఇంకా 13,000 వేల సంవత్సరాలు ఉన్నది. సంపూర్ణంగా కలి ప్రవేశించినపుడు – దోషాచారమే ధర్మంగా విరాజిల్లుతుంది . అందుకేనేమో – కలియుగంలో సదాచారం, దయా , ధర్మం – కేవలం భావనచేత పుణ్యఫలం లభిస్తుంది అని ఋషివాక్యం .
నారాయణ నారాయణ నారాయణ