[9:25 AM, 4/26/2025] Savita: సుపర్ణ
వినత పుత్రుడైన గరుత్మంతుడిని ‘సుపర్ణుడు’ అనికూడా అంటారు. శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడుడు , ఆయన అనేక లీలలకు ప్రత్యక్ష సాక్షి. ఆయనను స్మరించినంతమాత్రాన ‘విష’ ( దుష్టమైన ప్రభావాలు) తొలగుతాయని అంటారు. అట్టి మహానుభావుడిని ‘హరి కధలు ‘ వివరించమని …
వినతాసుత విని వేగమె
వివరింపగ రాదా!
వరమౌనుల మదిసాగర
మధనంబుల కథలూ!!
సరివారల పరివారము
పలుమారులు పలుకా,
గగనాంతర గహనంబున
నినదించెడి హరికథలూ!
బుధమానస పరిపాలుని
వరలీలల విరులూ!
వరియించిన చరితార్ధులు,
చెరియించిన గతులూ!!
సీతాపతి కననెంచిన
సురవైరుల తపమూ!
వరమౌనులు కురిపించిన,
ఆశీసుల సరులు !!
దితి సంతును దునుమాడగ
ధరకేగిన వరునీ!
వరియింపగ తరుణీమణి,
తలపోసిన విధమూ!
సురశేఖరు సుతుసంతును
సరిగాచిన శౌరీ!
పరివారపు పరిహాసపు
ఫలమాపని విధులూ!
అనిలాత్మజు మదినేలెడి
దశకంఠుని వైరి,
అలరించిన కులధర్మము
నినదించిన విధులు!!
బుుషి శాపము పరిమార్పగ
ధరకేగిన ఘనుడు,
లలనామణి నలరింపగ,
నడిపించిన కథలూ !!
వినతాసుత విని వేగమె
వివరింపగ రాదా!
వరమౌనుల మదిసాగర
మధనంబుల కథలూ!!