పలుమారు నిను వేడి

 పలుమారు నిను వేడి – పిన్ననైతిని నేను!

   పలుక వేలయ నీవు  –  ఖగవైరి శయనా!!

  కలికి కన్నుల కోలను – మైమరచి మునిగేవు

  మనుప మాకెవరయ్య – మధురాపురీశా!!

 

  భక్తమానస పురిన – కోరి చెర చేరెదవు,

 మంతనాలన మునిగి మైమచి  యుండేవు!   

 బ్రతుకు చీకటి చేరన బడలిపోయున్నాము ,

 చెర  బాప మాకెవరు –  భక్తానురక్తా !!

దన్తి మొరలాలించి రయమునుఱికినవాడ!       (గజేంద్రుడు)

పాంచాలి  పిలుపంది రక్ష జేసినవాడ!                ( ద్రౌపతి)

వైరిసుతు గావంగ జగతి నిండినవాడ,                (ప్రహ్లాదుడు)

చేరదీయర మమ్ము  – ఆర్తజన రక్షా!!

సుంకమెవరిదో నీవు  చెల్లింపబోయేవు,!               (రామదాసు)

జూదమాడిన జతను  ఆదుకొన  బోయేవో           (హత్తిరమ్  బాలాజీ )    

 పండరీశా  యన్న  సతి  రూపుఁనొందేవో!            (సక్కుబాయి)

మా  వెతలు  దీర్పంగ  ఒక  రూపు  గొనలేవ!

పలు వరములీయమని పంతమందను నేను,

పరకాయముల నొంది పలుచనౌమని అనను,

 తీరెరుంగని పూజ – తెరువెరుంగని బ్రతుకు,

 తెరపిచ్చి తరలించు – భవతాప హరణా!!

Leave a comment