నమ్మి చేరితి నిన్నే – నెనరుంచవయ్య

నమ్మి చేరితి నిన్నే – నెనరుంచవయ్య
దోషమెంచకు నాది – దయనేలమయ్యా
దురిత దూరుడవన్చు – నమ్మినానయ్య ,
దునిమి దుఃఖమునాది – దరిజేర్చుమయ్యా !!

జగతి మిధ్య యనంచు – విబుధులందురుగాని ,
ములుకులై మోహంబు బ్రతుకంత బాధించు,
బ్రతుకు భారంబాయే – వెతలే ఊపిరులాయె ,
ఆదరింపగ నాకు దిక్కు నీవే యంచు …..
నమ్మి చేరితి నిన్నే – నెనరుంచవయ్యా

తోలు తిత్తితనువు నమ్మరాదనంటారు,
నమ్మకుండిన గాని కడుపు కుడుపడుగు,
తొలగిపొమ్మని దాని తొలగించగాలెను,
తగులు తాపము దీర్ప దిక్కు నాకెవరయ్య
నమ్మి చేరితి నిన్నే – నెనరునుంచు

ఆటు పోటులజగతి – ఆటవిడుపట నీకు
గెలుపేరుంగాను నేను ఎప్పుడైనా,
ఓడినా గెలిచినా ఒరుగునేమియులేదు
ఓరిమంతయు నిగెరె ఏలుకొమ్ము!!
నమ్మి చేరితి నిన్నే – నెనరునుంచు

             

             

              

Leave a comment