దండోరా వేసి తెలుపరే – భవతారణ తరి
దండోరా వేసి తెలుపరే !!
గురుడు లేక గురుతులేదు – గురుతులేక భావుడు లేడు,
తనువులోని తారకుడిని – ఎరుగ నీకు గతి గురువని || దండోరా వేసి తెలుపరే||
ధరణీసుత నాధుడైన – మధురాపురి ధీరుడైన,
గురుచరణము సేవించక – వసుధ నడచు తరి తెలియరు !!
|| దండోరా వేసి తెలుపరే||
తులసి దాసు – రామ దాసు- పాండురంగ విఠలు కొలుచు,
తుకారాము నామదేవు – భక్త మీరాబాయిలైనా ,
తరుణమందు గురుకరుణను పొంది పథముగాంచిరంచు
|దండోరా వేసి తెలుపరే||
దేవేంద్రుడి తనయుడైన – కాల యముని పుత్రుడైన,
పరివారపు పలుచేతల పరిహాసపు చెరిత నడువ,
యదుభూషణు నుపదేశము యదనెంచిన వివరంబును |
| దండోరా వేసి తెలుపరే |
కరము చరిచి చిరత పట్టి గజ్జకట్టి చిందులేసి
జగతి నడచు నరులెల్లరు తెలిసి తెలివి కలుగునట్లు
పలు విధముల పలు తావుల – గురుడు లేక గతిలేదని
| దండోరా వేసి తెలుపరే- భావ తరణ తరి – దండోరా వేసి తెలుపరే ||
.