మంగళాంగా మరువబోకయ
మాలిమేరుగని మనసు నాదని!
మదన మోహన నీదు మహిమల
మోహామొందెడి మోహమీయరా!!
నామ మోహపు రతిన మునుగగ ,
శబరి పొందిన మోహమీయరా!
ఆట బొమ్మన అఖిల జగముల
నాధు గాంచిన మీర మోహము నందజేయర!!
మంగళాంగా మరువబోకయ
మాలిమేరుగని మనసు నాదని!
గొల్ల బాలురు , గోపా కాంతలు ,
రేపల్లె మొలిచిన రెల్లు పూవులు
మోహామొందిన మధుర భావన
భావించి మురిసెడి మోహమీయర !!
మంగళాంగా మరువబోకయ
మాలిమేరుగని మనసు నాదని!
అఖిల లోకము లాదరించెడి,
అతివ అరమరలన్ని వీడుచు,
మొహమొందెడి పాద పంకజ
మోహ రుచిగొన మోహమీయర !
మంగళాంగా మరువబోకయ
మాలిమేరుగని మనసు నాదని!
మదన మోహన నీదు మహిమల
మోహామొందెడి మోహమీయరా!!