స్వాతంత్ర సమరయోధుల తలపుతో –

https://amritmahotsav.nic.in/lori-thankyou.htm?381812

ఎందరో వీరులట ఉరికంబములనూగి, ఊయలేసిరి నీకు ఊగగా నేడు!!
తలచి వారల గాధ తేలు నిద్దుర మబ్బు,
బ్రతుకు పండెడి తలపు మొలవగా నీలో!!
జో జో!! జో జో!! జో జో!! జో జో!!

తెల్లదొరతనమునకు తలవంచలేనంచు,
రగిలి పొంగిన తెలుగు తేజముల నెరుగూ,
అల్లూరి శౌర్యమును, అనభేరి త్యాగమును,
ఆదరమునెంచి నీ భవిత నడిపించూ!!
జో జో!! జో జో!! జో జో!! జో జో!!

భరత భూమిన పుట్టి దాస్యమేలని ఎంచి,
పరదేశి పాలనను తరిమివేయగ నెంచి,
పసుమొగ్గ బాజీ నునులేత బారువా
తనువువొడి సాధించిరీ నాటి స్వేచ్ఛా !!
జో జో!! జో జో!! జో జో!! జో జో!!

భరతభూమిన పుట్టు భావితరములకొరకు,
  తనువు బాసిన వాని మరువబోకయ్యా!
  వారి కలలకు రూపు కలిగించగా నేర్చి,
  భరత దేశపు ఖ్యాతి పలుదెశల చాటు!! 
జో జో!! జో జో!! జో జో!! జో జో!! 

   నాటి వైభవమెల్ల నిలిపి నీ మదిలోన,
   మేటి దారుల నడిచి యశముగొన వయ్యా!
  తరుగను నెరగనీ ఖ్యాతి దశదిశల వెలుగంగ,
  భరతుడేలిన భూమి భవితనీ వగుమా!! 
 జో జో!! జో జో!! జో జో!! జో జో!! 

Leave a comment