కళ్యాణO

కళ్యాణ మాడెనట వేభవముగానూ – జగదంబ జగముకై పరమేశు ప్రతులా!

సీతమ్మ మనువాడె రామచంద్రుణ్ణి – శ్రీలక్ష్మ మనవాడె శేష శయనుణ్ణి,

గౌరితా మనువాడె రుద్ర రుపుణ్ణి – గాయత్రి మనవాడె బ్రహ్మదేవుణ్ణి! !కళ్యాణ!

పసిడి లంకన బుట్టి జనకునింటన పెరిగి – అవతార మూర్తియౌ శ్రీరాము మనువాడి,

కౌసల్య కోడలై దశరధుని పురమేగి – మోద మొందించెనట పురజనుల నెల్ల ! !కళ్యాణ!

నారాయణు నంబుచే ముక్తి నొందగ నెంచి – రాక్షసత్వము నంది తపియించు రక్కసులు,

కైక మనసున జేరి తమ తంతు నడిపించి – కాననకు గొంపోయిరా దంపతులను! !కళ్యాణ!

మైధిలిని హరియించి మనువాడుతా నంటె – మనుజ నైజము వల్ల రోషపడి శ్రీహరి,

వేగపడి తన తనువు హరియించు నంచు – మాయ నరపిన వాని మోహమొందించె! !కళ్యాణ!

తన భక్తునేనాడు ఎడబాయనా హరుడు – బంటుయై నడయాడి శ్రీరాము సేవించి,

యుక్తిగా తన భృత్యు నాదుకున్నడు – రావణుని తపమునకు వన్నెతెచ్చాడు ! !కళ్యాణ!

జంట వీడమటంచు ధరణి జేరినవారు – కారణంబేదెైన ఎడబాటు నొందారు,

ఎంత వారలకైన తప్పనీ వేదనను – చాటి జెప్పెడి చరిత సందేశమేమో! !కళ్యాణ!

దిక్పాలకుల సేవలనుదినంము అంది – ముని మనోధామముల మన్ననల నందు,

శేష తల్పపు విభుడు వరియించగా మురిసి- సిరి తాను మనువాడె వాసుదేవుణ్ణి ! !కళ్యాణ!

పలు సంకటము లందు మనలేని వారు – శరణు శరణని వేడ వేదనల దీర్ప,

అనుదినము అతిధిగా అరగేటి వాని – వెన్నంటి తిరుగుటే సిరికి శరణాయె! !కళ్యాణ!

ముల్లోకములు మెచ్చు లావణ్య రాశి – ముచ్చటగ పతిగూడి మురిపెమున దేల,

పలు వింత రూపముల మసలు నాధునికై- సుర సౌఖ్యముల విడచి చెరియింపనాయె! !కళ్యాణ!

క్షీరసాగరమందు బుట్టినా పసిడి – వరియించె విష్ణడని మురిసేను గాని,

దినదినము జాడకై వేసారు తల్లి – ఎరుక జేయగ నెంచు భావమది ఏది? !కళ్యాణ!

నగరాజ కన్యగా అవతరించిన శక్తి – తపియించి వరియించె ఫణి భూషణున్ని,

ప్రమధులను, అసురులను, గుణహీనులైనా- ఆదరించెడు గొప్ప మనసున్నవాడంచు! !కళ్యాణ!

హరహరా యనగానె వరములను కురిపించి – లంపటము లందగులు పెనిమిటిని గావగా,

చండికై, కాళికై, దుర్గయై, శాంభవై – దుందుడుకు దైత్యులను దునుమాడె నంట! !కళ్యాణ!

సంతు యందాశ గొని నలుగు బాలుని గంటె – తల నరికి గజము తల కూర్చి వేడిన పతికి,

జగమంత తన సంతు కరుణ గొను మంచు – మారు వరముల నొసగి మన్నించు కుంది! !కళ్యాణ!

జగమేలు జగదంబ జంగమయ్యను వలచి – మనువాడినా విధులు కధలు కధలాయె,

తనకు తప్పని విధులు తరుణులకు తగవంచు- నోములందెడి పడతి భావమది ఏది? !కళ్యాణ!

శృతులు పలికిన వాడు శ్రీహరికి కొమరుండు – శృష్టి నెరిపెడి వాడు వాసుదేవుని బంటు,

జ్ఞాని యని మనసుపడి మాతంగ ముని కన్య – వాణియై మనువాడి వాని జతజేరె! !కళ్యాణ!

విస్తరించెడి జగతి అణువణువు రచియించి – హరిహరుల ఆనతుల పరిధిలో వర్తించి,

నిత్య నూతనమైన జటిల కార్యములందు – తల మునకలౌ పతికి తన సేవలందించ, !కళ్యాణ!

తలరాత లోపమని అనుదినము నిందించు – పలు దూషణము లెంచు ప్రజనెల్ల లాలింప,

ప్రగ్య యై వ్యాపించి మన్ననల అందించి – తన విధిని వర్తించు హంస వాహిని వాణి ! !కళ్యాణ!

అనుదినము నాదమై నాధుదరి జేరినా – ఇసుమంత తరియైన తీరికెరుగని వాని,

ఇల్లాలిగా మెలగ భాగ్యమేమని విందు? ఎరుక నెరిగించు కధ ఏమి తెలిపేను? !కళ్యాణ!

Life

ఊపిరందిన నాడు ఏటికో మురిసితిని – ఎరుగా లేనైతి అది జతను వీడునని,
గయ్యాళి ఆలి వలె ప్రతి ఘడియ విడనాడి – తిరిగి జేరును బొంది రంగా!

నగుబాటు గాదంది రంగా!

ఊపిరందిన నాడు ఏటికీ మురిపెమని ఎన్నగా లేనైతి రంగా!

జంటబాయకు న న్ను రంగా! దయజూసి పాలించు రంగా!

పగటిలో రెయి లేదు రేయిలో పగలు – వెంట వెంటన నడిచి జంటయైనాయి,

ఉన్నదానిలొ లేక లేమిలో నిండున్న – భావమెరుకకు రాదు రంగా!

బహు వింత భావంబు రంగా!

ఊపిరందిన నాడు ఏటికీ మురిపెమని ఎన్నగా లేనైతి రంగా!

జంటబాయకు న న్ను రంగా! దయజూసి పాలించు రంగా!

సూర్య చంద్రలు కలిసి ఒక బాట నడిచితే – ముక్కంటి బంటులకు ముదిమి గలిగేనంట,

నింగిలో చందురుడు నిండుగా నవ్వితే – కడలి పోటెత్తేను రంగా!

ఇది ఏమి వరుసరా రంగా!

ఊపిరందిన నాడు ఏటికీ మురిపెమని ఎన్నగా లేనైతి రంగా!

జంటబాయకు న న్ను రంగా! దయజూసి పాలించు రంగా!

ఆట పాటల జగతి ఆటవిడుపట నీకు – ఆడి అలసిన వారి జేరదీసేవంట,

ఆడ నేర్వని నన్ను మాటిమాటికి జంపి – ఏమనెరిగించేవు రంగా!

ఏటికీ దొంగాట రంగా!

ఊపిరందిన నాడు ఏటికీ మురిపెమని ఎన్నగా లేనైతి రంగా!

జంటబాయకు న న్ను రంగా! దయజూసి పాలించు రంగా!

సాయి

షిరిడీలొ కొలువున్న సాయినాధుని ఘనత – ఇంపుగా తెలిపేము, వినుడు జనులారా!

బాలునిగ ఒకనాడు వేపనీడన జేరి – పురజనుల మన్ననలు మెండుగా దండుకొని,

యోగ సాధన కొరకు ఎచటికో తరలెళ్ళి- తిరిగి’సాయి’గ నీవు షిరిడి జేరావు!

షిరిడీలొ కొలువున్న సాయినాధుని ఘనత – ఇంపుగా తెలిపేము, వినుడు జనులారా!

ఏనోము నోచెనో ఆపాత నింబారు – నీదివ్య సాన్నిధ్యమును పొందగలిగింది,

ద్వారకామాయిగా నీ మన్ననలపొంది – తన ఒడిని నీ నెలవు చేయ గలిగింది,

షిరిడీలొ కొలువున్న సాయినాధుని ఘనత – ఇంపుగా తెలిపేము, వినుడు జనులారా!

నీపాదములు సోకి పావనంబైనట్టి – లెండివన భాగ్యమును ఏమనెంచేను?

నీ కరంబులు సోకి మొలచినా మొలకలకు – కైవల్యమే గాద జన్మ కారణము!

షిరిడీలొ కొలువున్న సాయినాధుని ఘనత – ఇంపుగా తెలిపేము, వినుడు జనులారా!

దాసగణు సేవలను మదిలోన మెచ్చి – బూటీకి నీ అస్తి నిలుపు భాగ్యమునిచ్చి,

బాయిజా మాతచే నైవేద్యముల నంది – ఆర్తజన మానసమే అమరధామ మనెంచు!

షిరిడీలొ కొలువున్న సాయినాధుని ఘనత – ఇంపుగా తెలిపేము, వినుడు జనులారా!

ధుని యన్న పేరుతో నిత్య హోమము నెరపి- పలు కర్మశేషముల నందంత మొందించి,

ఊది యే రక్షయని పంచి ఇచ్చిన వాడు- ప్రేమ మీరగ జగము నేలుచున్నాడు!

షిరిడీలొ కొలువున్న సాయినాధుని ఘనత – ఇంపుగా తెలిపేము, వినుడు జనులారా!

‘సాయి’ యన తలచితే ‘ఓయి’ అని పలికేను – వెన్నంటి తుదిదాక తన తోడు నిచ్చేను,

భాగ్యమేమని అందు సాయు భక్తులదీ – భవ బంధముల బాధ వారెరుంగనిది!

షిరిడీలొ కొలువున్న సాయినాధుని ఘనత – ఇంపుగా తెలిపేము, వినుడు జనులారా!

అలనాటి ఆసాయి నేటికీ నడయాడు – షిరిడి నేలను తలచి తరియించరండి,

పేదసాదల యందు, అన్నార్తులందెల్ల – ఆదివ్య ఛాయగని సేవచేయండి!

షిరిడీలొ కొలువున్న సాయినాధుని ఘనత – ఇంపుగా తెలిపేము, వినుడు జనులారా!

ఈతి బాధల బాపు సాయి చరితను చదివి – సర్వ వ్యాపకుడైన సాయి మహిమను ఎరిగి,

శరణు శరణని వేడి శరణు పొందండి – నిత్య ధామము జేరు తీరు తెలియండి!

షిరిడీలొ కొలువున్న సాయినాధుని ఘనత – ఇంపుగా తెలిపేము, వినుడు జనులారా!

ఎరుక

పూవులో పరకలో ప్రతిజీవి హృదిలో – సందడిగ స్పందించి, నాదించి, మోదించి,

నటియించు నటరాజు వైభవము ఎరుకకై- ఏకాంత వాసమును ఏలనొందగ వలెను?

సుందరంబౌ జగతి అణువణువునా నీవు – నిన్ను జేరుటకొరకు వేచియుంటి వనెరిగి,

ఏటికీ కనురెప్ప కంటిచూపును ఆపి – నీదివ్య యత్నమును ఘాతించ నెంచె?

రెప్పమాటున దాగి వీక్షించు నేత్రమును – మగత దుప్పటి కప్పి మరుగు పరచిన గూడ,

‘కల’ యన్న కధనడిపి మరల జూచుచు నుండు- ఈ దృష్ఠి ఎవరిదని నే నెవరి నడిగేది?

తండ్రి ఛాయలు లేని తనయులెట గలరు?- తల్లి మనసున లేని భావమెచ్చట గలదు?

నీదు సంకల్పంబు ఆదిగా ఎంచుకొని – జగదంబ మాయ యై నీ ముద్దు జెల్లించె!

స్పందనల సంకలన మీవిశ్వమైతే – ప్రతి స్పందనకు ఆది నీ యందె యుంటే,

మోహమందేల నీ ఉనికి లేకుంది? నిను వీడి ఆమోహ మెచట మనుచుంది?

కాల గమనమునందు మోదించు నీకు – కనికరము ఇసుమంత కువైనదేమో!

కార్చిచ్చు యై జగతి కల్లోల కధలాయె – కటిక శాసన మాని మధుర ప్రేమను పంచు!

ఎన్నియుగముల నుండి ఈ జగతి నడిచేను?- వింత పాయలు చీలి నీ అదుపు దాటేను,

ఏటికీ ఆటలిక మరలించు నీ మనసు – ఎరుకవై ఎదజేరు ఏమరక రమణా!

కాఫీ

coffee -1funny-coffee-mugs-mood-mug-1coffee 2

ఉదయ కిరణముతోటి’Sunrise’ కప్పు

పనిలోన అలసితే ‘Starbucks’ కప్పు

ఆకలనిపించితే ‘Instant’ కప్పు

మగత మధ్యాన్నాన’Espresso’ కప్పు

గుంకేటి సూర్యునితో ‘Nescafe’ కప్పు

ముసురు చీకట్లతో ‘Kapochino’ కప్పు

నిద్ర పట్టకపోతె ‘Black coffee’  కప్పు

ఏమి తోచకపోతె ‘Senseo’ కప్పు

ప్రతివేళ కొక Brand  ప్రతి mood  కొక కప్పు

నిన్ను చేరుట కొరకు Q లోన ఉన్నయి

సందియము మానుకుని సరి time చూసుకుని

కాఫీకి కరువేమి పట్టరా కప్పు!

coffee 3coffee 3coffee 3