మహాభారతం శాంతి పర్వం :భీష్ముడు ధర్మరాజుతో : తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని వేరే జన్మలలో సంచరిస్తున్న బలి చక్రవర్తి ఇంద్రుడి ప్రశ్నకు : యగ్యాలు, వ్రతాలు నిర్వహించటం , శీలవంతుడై జీవించడం వంటి విషయాలు కాలగతిని మార్చలేవు . కాలగతికి అవి కారణాలు కాజాలవు అని సమాధానం ఇచ్చాడు.
కాల గతులే గతులు – శూలికైన తమ్మిచూలికైనా !
రూపు గట్టిన పురుషుడందె కన్నియ రూపు,
రూపమెరుగనివాడు అంబికా పతి ఆయె !
కాలు మించినవారు కానరారు వినరారు ,
కాల గతులే గతులు – శూలికైన తమ్మి చూలికైనా !!
కశ్యప ప్రజాపతి భార్యలు – దితి , అదితి .
దితి – సంతానం దైత్యులు
అదితి : సంతానం అమరులు / దేవతలు
ప్రహ్లాదుడి మనుమడైన బలిచక్రవర్తి ని అణిచి – ఇంద్రుడికి సింహాసనం ఇచ్చాడు శ్రీమహావిష్ణువు
దితి తపః ఫలముగా ఉదయించినా రాజు ,
అదితి సంతును కూల్చి అమరలోకము మెట్టి,
విబుధ జన సేవలను ఎంతగా చేసినా,
సురలోక వంద్యున్డు మన్నించ లేదే!!
మరుగుజ్జు యైబుట్టి మహిమ లెన్నోజూపి,
అగ్రజుడె అధికుడని దితిపుత్రు నణగించి ,
యశము గాంచినవాని ఏమంచు మన్నింతు?
కాల గతులే గతులు ఏ కాలమందైన ,
కటిక సత్యమనెరిగి మౌనమొందికను!!
స్వర్గం లో ఉన్న పాండురాజుకి ” రాజసూయం” చేయటం వల్ల బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది అని తెలిసి , నారద మునీంద్రుడి ద్వారా ధర్మరాజుకు “రాజసూయ యాగం” చేయవలసిందిగా కబురు పెట్టాడు. రాజసూయ యాగం వలన అపారమైన జన నష్టం జరుగుతుంది అని తెలిసీ, తండ్రి కోరిక మేరకు ధర్మరాజు ఆ మహా యజ్జ్యం చేసాడు
ఈ భూమికి వచ్చే ప్రతి జీవికి తగిన వసతి కలిగించి గౌర వీస్తుంది భూమి . ఆ వసతి కేవలం ఈ భూమికే పరిమితం. అది ఏ నాడు సొంతం కాదు. భూమి అన్నింటిని recycle చేస్తూనే ఉంటుంది, దానికి తరుగు లేదు, పెరుగుదలా లేదు.
నీదికానీ వసతి తగిలించు బంధాలు , బంధనాలై నిన్ను బాధించుచున్నా, మరలనెంచని మనసు మారాము నాలించి , మరచి మాధవు నీవు మననెంచ నెలా ?
అచ్చరలు కిన్నెరలు అమరేంద్ర పాలితులు , అలక అలుపులు దీర విడిది నెంచెడి నెలవు, సుడులు తిరుగుచు తాను సూర్య చంద్రుల వెంట , పరుగు నెచటికో తాను పయనించు నెలవు !!
చేరవచ్చెడి వారి నాదరించగ తాను , తన తనువు చీల్చుకొని వసతిచ్చు నెలవు, కొలువుండు కాలాన తన సోయగములన్ని , కొసరి కుడుపుచు మరుల నందించు నెలవు!
ఈ కవిత 1980 ప్రాంతంలో రాసుకున్నది , math notebook చివరి page లలో రాసుకున్నది. ఆ పుస్తకం జాగ్రత్త చేసేడు నా పెద్ద తమ్ముడు … జీవితంలో నేను ఎంత ఎదిగానో ఎదో ఒక రోజు చూసుకుంటాను అనుకున్నాడేమో ..
కనిపించే ఈ లోకం – కనిపించని ఆ లోకం, కలలోనే కవ్వించే కమ్మనైన సుమ రూపం, నాలోనే ఒదిగుందట – ఎదిగిందట నాలోనే !!
ఈ కవిత నేను డిగ్రీ చదివే రోజులది (1970-80) అయుండాలి. ఆ పుస్తకం ఆఖరి పేజీ లో ఉంది. ఈ పాత కవితలు చూసినప్పుడు , మా తమ్ముడు వీటిని ఎందుకు నా పుస్తకాలు వెతికి వెతికి వీటిని జాగ్రత్త చేశాడా , అనిపిస్తుంది. ఆ కవితలు నేను ఎదగ లేదు అని నాకు చెబుతున్నట్టు అనిపిస్తుంది ……
ఆగస్టు 27రాత్రి 65 సంవత్సరాల క్రితం నాయీ శరీరం తెనాలి లో భూమి మీద safe landing అయింది .. అప్పటి నుంచి పెరిగి పెరిగి ఇప్పుడు ఇంత పెద్దది అయింది , ఇంకా ఎంత పెద్దది అవుతుందో ….